నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గతేడాది నవంబర్ 6న వదిలి వెళ్లిన ఆడ శిశువును దత్తత తీసుకోవచ్చని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి వి. లీలావతి దేవి తెలిపారు. ప్రస్తుతం శిశువు పొన్నాపురం కాలనీలోని ప్రత్యేక దత్తత కేంద్రంలో ఉందని, 30 రోజుల్లో ఎవరూ రాకపోతే చట్ట ప్రకారం అనాథగా ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. తగిన ఆధారాలు చూపించి శిశువును తీసుకెళ్లవచ్చని ఆమె సూచించారు.