నంద్యాల: బైక్‌ను ఢీకొట్టిన కారు.. బాలుడు మృతి

గోస్పాడు మండలంలోని తేళ్లపురి–పసురపాడు గ్రామాల మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో షరీఫ్ (13) అనే బాలుడు మృతి చెందాడు. తిరుపతి మస్తానయ్య తన కుటుంబంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల నుంచి కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో షరీఫ్ మరణించాడు. మిగిలిన ముగ్గురు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్