నంద్యాల: అంబటి వ్యాఖ్యలపై ఎంపీ శబరి ఫైర్, కేసులకు పిలుపు

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం నాడు సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఓటుతో తిరస్కరించినా వైసీపీ నేతల్లో మార్పు లేదని, అంబటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అంబటిపై టీడీపీ నేతలు కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్