నందికొట్కూరులో ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఆగ్రహం

నందికొట్కూరులోని అనసూయ చిన్నపిల్లల ఆసుపత్రి ముందు ఐదు నెలల బాలుడు అబ్దుల్ రెహమాన్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, వామపక్ష పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. వైద్య నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని వారు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్