నంద్యాల, నందికొట్కూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని 6వ వార్డు నాయకుడు పి. మాసమ్ మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యలు, రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తామని, 6వ వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వైఎస్సార్సీపీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని పి. మాసమ్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.