రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన పివి రావు మాల మహానాడు కమిటీ

నందికొట్కూరులలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పివి రావు మాల మహానాడు తాలూకా కమిటీ అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ సంఘీభావం తెలిపారు. శుక్రవారం 100 రోజుల విజయోత్సవ ర్యాలీలో పాల్గొని, కూటమిలోని ముగ్గురు ముఖ్య నాయకులు బాధితులకు ఇచ్చిన హామీ మేరకు జీఓ. 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓ ఇచ్చి నాలుగు దశాబ్దాలు గడిచినా అమలు చేయకపోవడం దారుణమని, వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు, వామపక్షాలు పాల్గొన్నాయి.

సంబంధిత పోస్ట్