నంద్యాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం సమీప ఫ్లైఓవర్‌పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునగాల గ్రామానికి చెందిన జయన్న (56) అనే వ్యక్తి మృతి చెందాడు. స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్