నందికొట్కూరు మున్సిపల్ వైసీపీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది కౌన్సిలర్లు వైసిపిని వీడి టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం టిడిపిలో చేరారు. వారిని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తూ జై జవాన్ జై కిసాన్ అంటూ నందికొట్కూరును అభివృద్ధి బాటలోకి తీసుకురావాలన్నారు. చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.