నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యలూరు మెట్ట సమీపంలో శనివారం సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి చేతిపై "సద్దాం, సిద్ధం" అనే టాటూ ఉన్నట్లు ఎస్ఐ గంగయ్య తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.