నందికొట్కూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని బైరాపురం బ్రదర్స్ ఫయాజ్, ఇంతియాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో 6వ వార్డులో వైఎస్సార్సీపీ జెండా ఎగరేసేలా కృషి చేస్తామని వారు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే 6వ వార్డు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బైరాపురం బ్రదర్స్ పేర్కొన్నారు.