నందికొట్కూరులో వైసీపీ నిరసన

నందికొట్కూరు పట్టణంలో డీఎస్సీ లీకేజీ అక్రమాలు, నిరుద్యోగ భృతి చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దార సుధీర్, పట్టణ అధ్యక్షులు మన్సూర్, ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం పార్టీ పరిశీలకులు బుడ్డా శేషి రెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, హాజరయ్యారు. ఈ అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు తీవ్రంగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕