పగిడ్యాల మండలంలో ఇంటి మెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలు జారిపడి 19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని నందిని మృతి చెందింది. మంగళవారం ఇంటి పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మెట్లపై ఊడుస్తూ పొరక అడ్డు తగలడంతో కాలు జారి కింద పడటంతో తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.