నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. విజయవాడ, కర్నూలు నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ రికార్డులు, పత్రాలను పరిశీలిస్తున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే కార్యాలయం పరిసరాల్లోని స్టాంప్ రైటర్ల షాపులు మూసివేశారు. సోదాలపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్