అమ్మాయిల భద్రతపై అవగాహన

నంద్యాల సబ్ డివిజనల్ శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి బుధవారం పాణ్యం మండలం సుగలి తాండ గ్రామం నందు గల మోడల్ స్కూల్ నందు అమ్మాయిల భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది.   శక్తి టీం ఆధ్వర్యంలో అమ్మాయిలకు భద్రత, ఈవ్ టీజింగ్, పోక్సో ఆక్ట్, నేటి డిజిటల్ యుగంలో పెరిగిన సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో వాడకంలో పోషించాల్సిన గోప్యత నియమాలు సైబర్ నేరాల నుంచి రక్షణ పొందే మార్గాలను సూచించారు. అమ్మాయిలు తప్పనిసరిగా తమ సెల్ ఫోన్ లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్