నంద్యాల పట్టణంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సోమవారం నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువ జయంతిని ఘనంగా నిర్వహించారు. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ, సామాజిక చైతన్యాన్ని తన కవిత్వం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన మహాకవి గుర్రం జాషువ అని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి తెలిపారు. జాషువ సాహిత్యాన్ని నేటి యువతకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జాషువ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.