నంద్యాలలో అర్ధరాత్రి ముసుగు దొంగల బీభత్సం.. సీసీ కెమెరాల్లో రికార్డ్

నంద్యాలలోని రైతునగర్ శ్రీసాయినగర్ వెంచర్‌లో అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు మెయిన్ గేటు ద్వారా ప్రవేశించి, అరగంట పాటు కాలనీలో తిరిగారు. ఒక తాళం వేసిన ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇల్లంతా వెతికినప్పటికీ ఏమీ దొరక్కపోవడంతో ఖాళీ చేతులతో వెనుదిరిగారు. దొంగల కదలికలన్నీ స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు రాత్రి గస్తీ పెంచి ముఠాను పట్టుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్