నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ లోని మోర్ సూపర్ మార్కెట్ పైన విజయ్ బాబు ఆసుపత్రిలో బుధవారం ఉదయం 7. 30 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక అధికారి సంఘటన చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని గాయాలు జరగలేదు అన్నారు. భారీ ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలోని రోగులను ఇతర ప్రయివేటు ఆసుపత్రులకు అంబులెన్సుల ద్వారా తరలించారు.