నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్స్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, ప్రసాదులు గడివేముల మండలం కరిమద్దెల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు శక్తి యాప్ గురించి, దాని నంబర్ 7993485111 గురించి సోమవారం వివరించారు. నేరాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటివి జరిగితే 112, 100 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. తల్లిదండ్రుల మొబైల్స్‌కు వచ్చే ఫేక్ మెసేజ్‌లు, ఏపీకే యాప్స్, పెళ్లి పత్రికల రూపంలో వచ్చే యాప్స్‌ను తెరవరాదని, బ్యాంక్ అధికారులమని చెప్పి ఓటీపీ నంబర్లు అడిగితే ఇవ్వరాదని అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.