సర్వీసులో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 3న యుటిఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, గోస్పాడు మండల ప్రధాన కార్యదర్శి వెంకట రమణ తెలిపారు. గోస్పాడు మండల పరిధిలోని దీబగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ, 30 ఏళ్ల సర్వీస్, 55 ఏళ్ల వయస్సు ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలు రాయాలని చెప్పడం దుర్మార్గమని, ప్రభుత్వం స్పందించి టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.