నంద్యాలలోని శ్రీ వివేకానంద ఆడిటోరియంలో శనివారం 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రముఖ కూచిపూడి నాట్యగురువు డా. వేదాంతం రాధేశ్యాం న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డా. జి. రామకృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ నాట్య విభాగాల్లో విద్యార్థులు పోటీ పడ్డారు, గెలుపొందిన వారికి నంది మెమంటోలతో సత్కరించారు.