పాణ్యం పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని వింత ఘటన చోటు చేసుకుంది. బుధవారం వేప చెట్టుకు పాలు వస్తుండటంతో. అక్కడి ప్రజలు ఈ వింతను చూడటానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వేప చెట్టుకు ధారగా పాలు కారాయి. పాలు రావడం నిజంగా ఈ ప్రాంతవాసుల అదృష్టంగా స్థానికులు చెబుతున్నారు. కొందరు వేప చెట్టుకు పూజలు కూడా చేశారు.