ఓర్వకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మైదుకూరు వెళ్తున్న స్కార్పియో వాహనం ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో మున్ని (35), షేక్ కమాల్ బాషా (50) అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారి నదియా (3) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్