గడివేముల బీసీ కాలనీలో పద్మావతి (31) అనే వివాహిత బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె బెడ్రూంలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం శ్రీనివాసులతో వివాహం జరిగిన పద్మావతికి ఇద్దరు సంతానం ఉన్నారు.