హెచ్. కొట్టాల: డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి

శనివారం, ఓర్వకల్లు మండల పరిధిలోని హెచ్. కొట్టాల సమీప జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బ్రాహ్మణపల్లెకు చెందిన ఎరుకలి మురళి (32) చికిత్స పొందుతూ మృతిచెందాడు. కర్నూలు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్