కర్నూలు బంగారుపేట మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సాధి కమిటీ సభ్యులు డా. రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు లేని అనాధ పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఈ స్పెషల్ ఆధార్ డ్రైవ్ అనాధలకు విద్య, వైద్యం, పునరావాసం కోసం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.