గడివేముల మండలం పెసరవాయి గ్రామ సమీపంలో శుక్రవారం ఒక లారీ అదుపుతప్పి ఒక పొలంలోకి దూసుకొని వెళ్ళింది. లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు పొలాల్లో పడిపోయింది. ఈ సమయంలో ఎవరు పొలాల వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.