ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకతీయ పాఠశాల సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న పాలకొలను గ్రామానికి చెందిన రాముడు, రమేష్ గాయపడ్డారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.