పాణ్యం: బైక్‌ను ఢీకొన్న ఐచర్.. మహిళ మృతి

పాణ్యం మండలం తమ్మరాజుపల్లె ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం స్థానికుల సమాచారం మేరకు పాణ్యం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, భారతి (48) స్కూటీపై వెళ్తుండగా వెనుకవైపు నుండి ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా బైక్ పై వెళ్తున్న భారతి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్