పాణ్యం: గిరిజన బాలికల పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం

2025-26 విద్యా సంవత్సరానికి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపాల్ మేరీ సలోమి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ తరగతికి 85 సీట్లు (చెంచు - 75, ఎస్సీ-2, ఓసీ-1, బీసీ-1, ఏక్యూ-1) కేటాయించారు. 4వ నుంచి 9వ తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని, దరఖాస్తు చివరితేది ఈనెల 25 అన్నారు. వివరాలకు 7989834662 నంబరును సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్