పాణ్యం: హోటల్ వద్ద గొడవ.. వైసీపీ కార్యకర్తపై దాడి

ఓర్వకల్లు మండలం పూడిచెర్లకు చెందిన వైసీపీ కార్యకర్తపై కుటమి నాయకులు దాడికి పాల్పడ్డారు. సోమవారం ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వైసీపీ కార్యకర్త శశికుమార్ రెడ్డి కర్నూలు నుంచి పూడిచెర్లకు ఆటోలో ఇంటికి వెళ్తూ ఒక హోటల్ వద్ద భోజనం కోసం ఆగడంతో అక్కడే ఉన్న కూటమి మద్దతుదారులైన మహేష్, రామాంజనేయులు, శ్రీనివాసులతో మాటామాట పెరిగి గొడవ జరిగినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్