నంద్యాల, గుంటూరు జిల్లాల్లోని పోలీసు స్టేషన్ల పరిధిల్లో పలు బందిపోటు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పిoచుకొని తిరుగుతున్న నిందితుడిని సోమవారం పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో పాణ్యం చెంచు కాలనీకి చెందిన మేకల హనుమంతు అనే నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. బంగారు, వెండి ఆభరణాలు, నగదును సీజ్ చేశామన్నారు.