పాణ్యం: రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని వ్యక్తి మృతి

పాణ్యం మండలంలోని కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల విశ్వనగర్‌కు చెందిన మిట్నాల జగదీష్ (45) మృతిచెందారు. ఆసుపత్రికి వస్తూ రోడ్డు దాటుతుండగా పాణ్యం వైపు వెళ్తున్న బైక్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై జగదీష్ అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న అక్బర్, ఆయన కుమార్తె గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్ మార్చురీకి తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్