పాణ్యం సమీపంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల నుండి పాణ్యం వస్తున్న టిప్పర్ డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ రంగస్వామి గాయపడినట్లు తెలిపారు. హైవే పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి విచారించి వాహనాలను తొలగించారు.