రెండో పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం

నంద్యాల పట్టణ పరిధిలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ నూతన సీఐగా జి. సుధాకర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా గుర్తింపు పొందారు. తాజాగా రెండో పట్టణ బాధ్యతలు చేపట్టిన సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕