ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కర్నూలు జిల్లా పత్తికొండలో బుధవారం విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ పలు కళాశాలలను బంద్ చేశారు. రూ. 6, 800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, అన్ని కోర్సుల ప్రవేశాల పూర్తి, హాస్టళ్లకు పక్కా భవనాలు, నాణ్యమైన ఆహారం, జీవో 77 రద్దు, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ, జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ పవన్ కళ్యాణ్‌తో పాటు గణేష్, అశోక్, ప్రవీణ్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.