పత్తికొండ పట్టణంలో మంగళవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుమ్మరి వీధిలో నివసిస్తున్న మునిలక్ష్మి, లక్ష్మన్న దంపతుల ఇంట్లో మునిలక్ష్మి పనికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బీరువా పగులగొట్టి 5 తులాల బంగారు ఆభరణాలు మరియు రూ.13,000 నగదును దొంగిలించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులతో ఆధారాలు సేకరిస్తున్నట్లు సీఐ జయన్న తెలిపారు.