తుగ్గలి మండలంలోని రామాపురంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం వెంకటేష్ (30) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు. తమిళనాడుకు చెందిన తన స్నేహితురాలు రాజేశ్వరి గతనెల 14న ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురై ఒంటరిగా ఉండాలేక ఇంటి పైకప్పులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.