పత్తికొండ: పని భారంతో అనారోగ్యానికి గురవుతున్నాం

ప్రభుత్వం తమపై పనిభారం మోపడంతో అనారోగ్యాలకు గురవుతున్నామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పనిభారం నుంచి ప్రభుత్వం ఉపశమనం కల్పించాలని కోరుతూ ఆమె యూనియన్ సభ్యులతో కలిసి వెల్దుర్తిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో లూక్ కు వినతిపత్రం అందజేశారు. రోజురోజుకి పనిభారం పెరుగుతూ యాప్ లతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్