వెల్దుర్తి మండలంలోని రామళ్లకోటకు చెందిన 15 ఏళ్ల కరిష్మా బీ, పదో తరగతి పరీక్షల్లో 361 మార్కులు సాధించడంతో తక్కువ మార్కులు వచ్చాయని భావించి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న కరిష్మా, వంటగదిలో ఉరివేసుకుంది. చెల్లెలు గమనించి కాలనీవాసులకు సమాచారం అందించడంతో తల్లిదండ్రులకు తెలియజేశారు. వైద్యులు ఆమెను పరీక్షించినప్పుడు మృతిచెందినట్లు నిర్ధారించారు.