సుపరిపాలన అంటే ఎలా ఉండాలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆదర్శంగా చేసి చూపుతుందని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం కుమార్ అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని జి ఎర్రగుడి గ్రామంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక టిడిపి సీనియర్ నాయకుడు వెంకటస్వామి, మాజీ ఎంపీపీ చంద్రన్న, టిడిపి పార్టీ సాధికార రాష్ట్ర సభ్యులు వీర శైవ లింగాయత్ బాదాడ కౌశిక్, ల సమక్షంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.