రానున్న దీపావళికి ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మంగళవారం కర్నూలులోని జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ ను దీపావళికి అందిస్తామని, దీపావళికి మీ ఇంట్లో నేనే వంట చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని వెల్లడించారు.