కర్నూలు జిల్లా, పత్తికొండ సమీపంలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో శనివారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దుల కర తెంచడం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ఎద్దుల రైతు యజమానులను వాల్మీకి సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు సన్మానించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, కురువ పక్కన రామాంజనేయులు, ముద్దు తిమ్మప్పతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.