నంద్యాల జిల్లా మహానంది కోనేరు వద్ద చంద్రశేఖర్ అనే బాలుడు మూర్చకు గురైన సంఘటన చోటుచేసుకుంది. చంద్రశేఖర్ అనే బాలుడు మూర్చకు గురి కావడంతో అంబులెన్స్ లో నంద్యాల జిజిహెచ్ కు తరలించారు. మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మంగళవారం బాలుడి తల్లిదండ్రులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.