మహానంది మండలం బోయలకుంట్ల మెట్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాజులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి గాయపడ్డాడు. నంద్యాల వైపు బైక్‌పై వెళ్తున్న అతడిని ఆళ్లగడ్డ దిశగా వస్తున్న లారీ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.