ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సిద్దాపురం చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో, కర్నూలు నుండి విజయవాడ వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం, ఆత్మకూరు నుంచి విజయవాడ, శ్రీశైలం వెళ్లే వాహనాలను నంద్యాల, గిద్దలూరు మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.