బనగానపల్లె: కుటుంబ కలహాలతో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన రామాంజనమ్మ అదృశ్యమైన ఘటనపై నందివర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆమె ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త నాగార్జున ఫిర్యాదు చేశారు. ఎస్సై భూపాలుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్