బనగానపల్లె మండలం బీరువోలు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ మహేష్(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడరంగు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.