బనగానపల్లె: విద్యుదాఘాతంతో యువకుడు మృతి

కొలిమిగుండ్ల మండలం మదనంతపురం గ్రామానికి చెందిన చెన్నకేశవ రెడ్డి (27) బుధవారం నాపరాతి గనుల్లో పనికి వెళ్ళినప్పుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ రమేష్ బాబు స్పందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్