సున్నిపెంటలో సోమవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐవైఎఫ్ కార్యదర్శి బి. లక్ష్మయ్య నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో భగత్‌సింగ్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగాలను, ఆయన ఆశయాలను నాయకులు స్మరించుకున్నారు. యువత ఆయన స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.