శ్రీశైలం RTC బస్టాండ్ సమీపంలో దుకాణదారుడు, హైదరాబాద్‌కు చెందిన భక్తుల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. భక్తులు కారు పార్కింగ్ చేయడం వల్ల దుకాణం తెరవడంలో ఇబ్బంది ఏర్పడిందని, దీంతో టైరు గాలి తీయడంతో వాగ్వాదం పెరిగి దాడికి దారితీసిందని సమాచారం. ఈ ఘటనపై సీఐ జీవన్ గంగనాధ్ బాబు స్పందిస్తూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.